31-03-2025 07:13:01 PM
కాటారం (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ధన్వాడ గ్రామంలో ఇటీవల మరణించిన మాజీ ఎంపీటీసీ బోడ మమత తండ్రి, భీముని సత్తక్క, అడ్డూరి రాజేశ్వరి, కోరుకొప్పుల సమ్మక్కల కుటుంబ సభ్యులను తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) సోమవారం పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు భరోసా కల్పించారు. ఆయన వెంట కాటారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేమునూరీ ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపీపీ పంతకాని సమ్మయ్య, నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చీమల సందీప్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చిటూరి మహేష్, నాయకులు బోడ శ్రీధర్, శ్రవణ్, కారెంగల తిరుపతి, చీర్ల చంద్ర శేఖర్ తదితరులు పాల్గొన్నారు.