21-03-2025 01:32:55 AM
మంథనిమార్చి20(విజయ క్రాంతి) మంథని పట్టణంలో గురువారం రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పలు బాధిత కుటుంబాలను పరామర్శించారు. మంథని పట్టణనికి చెందిన సువర్ణ ముత్తన్న, దుద్దిల్ల మోహన్ రావు, కూకట్ల సాయి తేజ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల చిత్రపటాలకు పూలమాలవేసి మంత్రి ఘనంగా నివాళులర్పించారు. మంత్రి వెంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఐలి ప్రసాద్, మాజీ సర్పంచ్ ఒడ్నాల శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.