calender_icon.png 30 March, 2025 | 10:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్యాన్సర్ బాధితుడికి మంత్రి శ్రీధర్‌బాబు పరామర్శ

26-03-2025 12:00:00 AM

యువకుడి -కోరిక మేరకు క్రికెట్ కిట్ అందజేత

శేరిలింగంపల్లి, మార్చి 25: భూపాలపల్లి జిల్లా పాలిమల మండలం సర్వేపేటకు చెందిన బోత్ నితిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. ఖాజాగూడాలోని స్పర్శ హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్నాడు. విషయం తెలుసుకున్న మంత్రి శ్రీధర్‌బాబు మంగళవా రం సాయంత్రం పరామర్శించారు. తాను క్రికెటర్ కావాలని కలలు కన్నానని మంత్రితో బాధితుడు చెప్పుకున్నాడు. మంత్రి వెంటనే క్రికెట్ కిట్టును తెప్పించి అందజేశారు. బాధితుడి తల్లిదండ్రులతో మాట్లాడి భరోసా ఇచ్చారు.