calender_icon.png 4 December, 2024 | 2:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అస్వస్థతకు గురైన విద్యార్థినులను పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు

01-11-2024 06:05:43 PM

మంథని,(విజయక్రాంతి): ముత్తారం కస్తూర్బా గాంధీ విద్యార్థినీలకు పూర్తిస్థాయిలో కోలుకునే వరకు మెరుగైన వైద్యం అందిస్తామని అస్వస్థతకు గురైన విద్యార్థినులను పరామర్శించిన అనంతరం మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ముత్తారం మండల కేంద్రములోని కేజీబీవీ విద్యార్థినులు అస్వస్థతకు గురై  హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో ముగ్గురు విద్యార్థులు  రక్షిత, రేవతి, సునీత విద్యార్థినులను చికిత్స పొందుతుంది. వారిని మంత్రి పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. పూర్తిగా కోరుకున్న అనంతరం విద్యార్థులను ఇంటికి పంపిస్తామని వైద్యులు తెలిపినట్లు మంత్రి వెల్లడించారు. మంత్రి శ్రీధర్ బాబు వెంట ప్రభుత్వ చీఫ్ విప్ అట్లూరి లక్ష్మణ్ కుమార్ ఉన్నారు.