08-02-2025 09:04:04 PM
మంథని (విజయక్రాంతి): మంథని పట్టణంలో శనివారం సాయంత్రం బాధిత కుటుంబాలను పరామర్శించిన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు బాధితులకు భరోసా కల్పించారు. కాంగ్రెస్ పార్టీ పెద్దపెల్లి జిల్లా సోషల్ మీడియా ఇంచార్జి ఆరేళ్లి కిరణ్ గౌడ్ ఇటువల అనారోగ్యంతో బాధపడుతుండగా స్వయంగా అతని ఇంటికి వెళ్లి పరామర్శించి ఆయన యోగక్షేమాలు తెలుసుకున్నాడు. అలాగే పట్టణంలో అవధానుల గోపాల్, ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా వారి కుటుంబ సభ్యులను హనుమర్శించారు. మంత్రి వెంట మంథని తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ రమాదేవి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆయిలి, ప్రసాద్, నాయకులు ముసుకుల సురేందర్ రెడ్డి, డిగంబర్, తదితరులు పాల్గొన్నారు.