calender_icon.png 7 January, 2025 | 8:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాధిత కుటుంబాలను పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు

05-01-2025 12:13:45 PM

మంథని, (విజయక్రాంతి): ముత్తారం మండలంలో ఆదివారం బాధిత కుటుంబాలను  రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) పరమర్శించారు. మచ్చుపేటలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు దుండే రాజేశం ఇటీవల మృతిచెందగా వారి కుటుంబ సభ్యులను, మైదంబండ గ్రామంలో యూత్ కాంగ్రెస్ నాయకుడు బియ్యని రాజబాబు తండ్రి బియ్యని ఎల్లం అనారోగ్యంతో మృతిచెందగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతుల చిత్రపటాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. మృత్తికి గల కారణాలను వారి కుటుంబ సభ్యులను అడిగి మంత్రి తెలుసుకున్నారు. మంత్రి వెంట కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మాజీ జడ్పిటిసి చొప్పరి సదానందం, మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ, యూత్ నాయకుడు బియ్యని శివకుమార్, మాజీ సర్పంచ్  సిరికొండ బక్కారావు, నాయకులు మద్దెల రాజయ్య, బూడిద శ్రీనివాస్, చెలకల జితేందర్ యాదవ్, వాజిద్ పాషా, తదితరులు పాల్గొన్నారు.