ముత్తారం,(విజయక్రాంతి): మంథని, ముత్తారం, ఓడేడు వరకు రూ. 60 కోట్లతో నిర్మిస్తున్న రోడ్డు పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదివారం తెలిపారు. మైదంబండలో విలేకరుల సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ... ముత్తారం మండలంలోని ఓడేడు నుండి మంథని వరకు ఇబ్బందికరంగా ఉన్న ప్రధాన రహదారి రోడ్డు నిర్మాణం పనులు పకడ్బందీగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ఎన్నికలు కాగానే ఆర్ అండ్ బీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలిపి, ముత్తారం నుంచి మంథని వరకు పూర్తిస్థాయిలో రూ.60 కోట్లతో నిధులు మంజూరు చేపించామన్నారు. ఈ రోడ్డుకు సహకరించిన ఆర్ అండ్ బీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ముఖ్యమంత్రికి ముత్తారం ప్రజలందరి తరఫున శ్రీధర్ బాబు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ రోడ్డు నిర్మాణంలో భాగంగా ఎక్కడైతే గ్రామాలు వస్తాయో, అక్కడ కూడా మీడియంలో సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటు చేయాలని చెప్పారు. నాణ్యతతో కూడిన రోడ్డు నిర్మాణ చేపట్టాలని చేపట్టాలని ఆర్ అండ్ బి అధికారులకు సూచించారు.