మంథని (విజయక్రాంతి): కమాన్ పూర్ మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు కోలేటి నాగభూషణం సతీమణి కోలేటి సుశీల ఇటివల మరణించగా ఆదివారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు పరామర్శించారు. ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారి కుమారులైన మాజీ ఎంపీపీ కోలేటి మారుతి సోదరులు అంజన్న, వేణుతో పాటు వారి కుటుంబ సభ్యులను మంత్రి పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మంత్రి వెంట మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.