11-02-2025 02:12:46 PM
ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు
చేవెళ్ల,(విజయక్రాంతి): రాముడి పేరుతో దాడులు చేస్తే సహించేది లేదని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు(IT, Industries Minister Sridhar Babu) హెచ్చరించారు. మంగళవారం మొయినాబాద్ మండలంలోని చిల్కూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్(Archakulu Rangarajan) ను ప్రభుత్వ విప్ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే కాలే యాదయ్య, సీనియర్ నాయకులు వీ. హనుమంత రావుతో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. రంగరాజన్ పై దాడి అమానవీయ చర్య అని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
రామరాజ్యం పేరిట దేవుడి పేరుతో అరాచకాలు సృష్టిస్తే సహించేది లేదని హెచ్చరించారు. పోలీసులు నిందితుల్లో ఇప్పటికే కొందరిని అరెస్ట్ చేశామని స్పష్టం చేశారు. చిలుకూరు బాలాజీ దేవాలయం(Chilkur Balaji Temple) వద్ద భద్రత పెంచాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. రాముడి పేరు మీద దాడులు చేయడం దురదృష్టకరమని, నిందితులను ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తుందన్నారు. ఆలయ భద్రత విషయంలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటుందని తెలిపారు.