హైదరాబాద్: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించి ఏడాది అవుతోందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. శనివారం వరంగల్ జిల్లాలో మంత్రి శ్రీధర్ బాబు పర్యటిస్తున్నారు. కీర్తినగర్ లో బ్రాహ్మణ భవనాన్ని మంత్రి ప్రారంభించారు. మహిళల ఉచిత ప్రయాణం డబ్బులను ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లిస్తోందన్నారు. 200 యూనిట్లు వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. రూ. 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం. రైతులకు రూ. 2 లక్షల వరకు రుణాలు మాఫీ చేశాం. సన్నవడ్లకు రూ. 500 బోనస్ ఇస్తున్నాం. మిగతా హామీలను రాబోయే కాలంలో అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని భారీ అప్పుల్లోకి నెట్టిందని మంత్రి ఆరోపించారు. నిధుల కొరత వల్ల కొన్ని పథకాలు ఇంకా అమలు చేయలేకపోయామని చెప్పారు.