calender_icon.png 4 October, 2024 | 8:33 PM

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రతి గుడిలో దూప దీప, నైవేద్యం

04-10-2024 06:10:29 PM

మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు ఆశయం నేటికీ కొనసాగింపు

రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు 

జగిత్యాల, (విజయక్రాంతి): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రతి గుడిలో దూప, దీప, నైవేద్యం మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు ఆశయం నేటికీ కొనసాగుతుందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. శుక్రవారం జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని వెటర్నరీ కళాశాల ముందు ఏర్పాటు చేసిన జువ్వాడి రత్నాకర్ రావు విగ్రహాన్ని శ్రీధర్ బాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... రైతు నేతగా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన నాయకుడిగా ప్రజల మన్ననలు పొందిన మహోన్నత వ్యక్తిగా రత్నాకర్ రావు నిలిచాడని ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారని అన్నారు.

రాష్ట్రంలోనే బడుగు బలహీన వర్గాలు బాగుంటే మొత్తం రాష్ట్రం బాగుపడుతుందని ఆలోచించే ఏకైక వ్యక్తి రత్నాకర్ రావు అని ఆయన చూపించిన బాటలో ముందుకు వెళ్తున్నామని అన్నారు. ఏ కష్టం వచ్చినా పేదలకు బాసటగా నిలిచిన వ్యక్తిగా ఆయన పేరుగాంచారని అన్నారు. ఆయన వెంట భువనగిరి, పెద్దపల్లి ఎంపీలు కిరణ్, గడ్డం వంశీ, ఎమ్మెల్సీలు జీవన్ రెడ్డి, భానుప్రసాద్ రావు, ప్రభుత్వ విప్ లు, ఎమ్మెల్యేలు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఆది శ్రీనివాస్, డాక్టర్ సంజయ్ కుమార్ తదితరులు మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు గొప్పతనాన్ని మరో సారి మననం చేసుకున్నారు. మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు తనయులు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, కోరుట్ల నియోజక వర్గ ఇంచార్జి జువ్వాడి నర్సింగ రావు, జువ్వాడి కృష్ణారావు, శేఖర్ రావు, ఉమ్మడి జిల్లాలోని అన్ని మండలాల,పట్టణాల జువ్వాడి అభిమానులు, నాయకులు, ప్రజలు ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, వైద్యులు పాల్గొన్నారు.