08-03-2025 10:48:06 PM
మంథని (విజయక్రాంతి): అంబేద్కర్ చౌక్ లో ఎస్సీ సబ్ ప్లాన్ ద్వారా రూ. 10 కోట్ల నిధుల మంజూరు పట్ల కాంగ్రెస్ పార్టీ మంథని ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు మంథని రాకేష్ ఎస్సీ సెల్ డివిజన్ అధ్యక్షులు మంథని సత్యం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మన ప్రాంతా అభివృద్ధి ప్రదాత రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చిత్ర పాటలకు శనివారం పాలాభిషేకం చేశారు.
ఈ కార్యక్రమం నాయకులు మంథని రాకేష్, మంథని సత్యం, మాజీ సర్పంచ్ చెంద్రు రాజమల్లు, కాంగ్రెస్ పార్టీ మండల అధికార ప్రతినిధి తోకల మల్లేష్ లు మాట్లాడుతూ... 2014లో ఆగిపోయిన ఎస్సీ సెల్ సబ్ ప్లాన్ నిధులను కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన వెంటనే నిధులు మంజూరు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామని, ఈ ప్రాంత అభివృద్ధి ప్రదాత మంత్రి శ్రీధర్ బాబు గ్రామాలలో ఉన్న ఎస్సీ కాలనీలలో రోడ్లు గాని, డ్రైనేజీ మురికి కాలువల వ్యవస్థ దృష్టిలో పెట్టుకొని ఇంత పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయడం చాలా సంతోషకరమని అన్నారు.
ఎస్సీ కాలనీలలో ఉంటున్న ప్రజలకు ఏ రకంగా అభివృద్ధి జరుగుతుందో తెలియజేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని మంథని రాకేష్ అన్నారు. రానున్న రోజులలో గ్రామ గ్రామంలో ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో పాలాభిషేక కార్యక్రమాలు నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం దళితులకు పెద్దపీట వేశారని, దళిత కాలనీలను, దళిత నాయకులను ఉన్నత స్థాయిలో ఉంచాలని వారి యొక్క ఆకాంక్ష అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో దళిత సోదరులు, నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు పాల్గొన్నారు.