calender_icon.png 3 April, 2025 | 9:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాంపల్లి కోర్టుకు మంత్రి శ్రీధర్‌బాబు

03-04-2025 01:22:33 AM

2017లో నమోదైన కేసు విచారణకు హాజరు

హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 2 (విజయక్రాంతి): ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు బుధవారం నాంపల్లి కోర్టుకు హాజరయ్యా రు. కాళేశ్వరం ప్రాజెక్టులో భూము లు, ఇండ్లు కోల్పోయిన వారికి న్యా యం చేయాలని డిమాండ్ చేసినందుకు గత ప్రభుత్వంలో 2017లో పెద్దపల్లి జిల్లా బసంత్‌నగర్ పోలీసులు నమోదు చేసిన కేసు విచారణ కు ఆయన వచ్చారు. ఆయనతో పా టు హర్కర వేణుగోపాల్, అన్నయ్యగౌడ్, శశిభూషణ్ కాచె, మరో 9మం దిపై కేసు నమోదైంది. కాగా విచారణలో భాగంగా జ్యూడీషియల్ ఫస్ట్ క్లాస్ న్యాయమూర్తి ఎదుట శ్రీధర్‌బా బు హాజరయ్యారు.