calender_icon.png 23 December, 2024 | 5:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదలకు అండగా మంత్రి శ్రీధర్ బాబు

23-12-2024 01:04:40 AM

 శ్రీధర్ బాబు అనుచరుడు బాధితులకు ఎల్‌ఓసీ అందజేత 

మంథని, డిసెంబర్ 22(విజయక్రాంతి): పేద ప్రజలకు అండగా నిలుస్తున్నారు రాష్ర్ట మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. మంథని నియోజక వర్గంలో అనారోగ్యంతో ఉన్న బాధితులకు మంత్రి అండగా ఉంటూ భరోసా కల్పిస్తున్నారు. కమాన్ పూర్ మండలంలోని గుండారం గ్రామానికి చెందిన కందుల ఓదెలు కు రూ. 3,75,000 ఎల్‌ఓసిని మంజూరు చేసి ఇప్పించారు. ఓదెలు కు గుండె సర్జరీ వైద్య  చికిత్సకు సంబంధించిన రూ. ( 3,75,000 ఎల్‌ఓసిని) నిమ్స్ ఆసుపత్రి లో అనారోగ్యంతో చికిత్స  పొందుతున్నట్లు సహాయం కొరకు మంత్రి కి తెలుపగా,  వెంటనే సీఎంఆర్‌ఎఫ్  ద్వారా వైద్య ఖర్చుల నిమిత్తం ఈ ఎల్‌ఓసీ మంజూరు చేయించారు. మంత్రి  ఆస్పత్రి సహాయకులు వారికి హైదరాబాద్  లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో  అందచేశారు. ఆర్థిక సహాయం అందించిన మంత్రి శ్రీధర్ బాబు  వారి కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.