calender_icon.png 1 March, 2025 | 3:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుంభమేళాకు వెళ్లొస్తుండగా రోడ్డు ప్రమాదం.. యూపీ మంత్రితో మాట్లాడిన మంత్రి శ్రీధర్ బాబు

01-03-2025 12:06:28 PM

గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించేందుకు యూపీ మంత్రితో మాట్లాడిన మంత్రి శ్రీధర్ బాబు  

మంథని: (విజయక్రాంతి) ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళాకు వెళ్లొస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో 9 మందికి గాయాలయ్యాయి. స్థానికుల వివరాల ప్రకారం.. మంథనికి చెందిన మిరాల సాగర్, రామగిరి మండలం నాగెపల్లికి చెందిన నేరెళ్ల విజయ్, మరో ఏడుగురు గత సోమవారం మహాకుంభమేళాకు వెళ్లారు. శుక్రవారం ఉదయం తిరిగి వస్తుండగా వారి వాహనం చెట్టును ఢీకొట్టింది. గాయపడినవారిని తొలుత కౌశంబి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్య కోసం ప్రయాగరాజ్ జిల్లా స్వరూప్రోణి మెడికల్ కళాశాలకు తీసుకె ళ్లి, చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుల కుటుం సభ్యులు అక్కడికి బయలుదేరి వెళ్లారు.

మంథని పట్టణానికి చెందిన మిరాల సాగర్ యాదవ్ (ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్) రామగిరి మండలానికి చెందిన నేరెళ్ల విజయ్ గౌడ్ సాగర్ యాదవ్ బందువులైన మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా ఎటపల్లికి చెందిన దండిగ అశోక్ కుటుంబ సభ్యులతో ప్రయోగ రాజ్ కుంభమేళకు వెళ్లి పుణ్య స్థానం చేసి తిరిగి వస్తుండగా శుక్రవారం తెల్లవారుజామున వారు ప్రయాణిస్తున్న కారు ప్రమాదవశాత్తు చెట్టుకు ఢీకొనడంతో సాగర్ తో పాటు  కారులో ప్రయాణిస్తున్న పలువురికి గాయాలయ్యాయి. వారిని వెంటనే తరలించి స్థానికులు చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సోదరుడు శ్రీనుబాబు గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించేందుకు రిటైర్ మేజర్ సంతోష్ ను ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర మంత్రితో మాట్లాడి  గాయపడ్డ వారి దగ్గరికి రిటైర్ మేజర్ సంతోష్ ను పంపించారు. మెరుగైన చికిత్స అందించేందుకు ప్రయత్నిస్తూ ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య సమాచారం తెలుసుకుంటూ కుటుంబ సభ్యులకు మంత్రి తన సోదరుడు మనోధైర్యం కల్పిస్తున్నారు.