09-12-2024 12:01:04 PM
హైదరాబాద్: ప్రజా ప్రభుత్వం గొప్ప కార్యక్రమాన్ని చేపడుతోందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు సభలో అన్నారు. రాజకీయ ప్రస్థావనతో అసెంబ్లీకి రావద్దనేది విపక్ష నేతల ప్రయత్నమన్న శ్రీధర్ బాబు అసెంబ్లీ రూల్స్ కు విదరుద్ధంగా సమావేశాలకు రాకుండా చూసే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. తెలంగాణ యావత్తు ప్రజలు ఈ సమయం కోసం వేచి చూస్తున్నారని వెల్లడించారు. ప్రత్యేక అంశంలో పాల్గొనాలని ప్రతిపక్షాలను కోరుతున్నామని తెలిపారు. రాజకీయాలను పక్కన పెట్టి అందరూ రావాలని కోరతున్నామన్నారు. తెలంగాణ తల్లి విగ్రహ తయారీకి ప్రభుత్వానికి పూర్తి అధికారం ఉందని మంత్రి పేర్కొన్నారు.