మంథని, సెప్టెంబర్ 15 (విజయక్రాంతి): రాష్ట్రంలో ప్రజా సంక్షేమం నిర్విఘ్నంగా కొనసాగాలని.. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ మరో పది రెట్లు పెరగాలని ఆదివారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తన సతీమణి శైలజతో కలిసి మంథని పట్టణంలోని రావుల చెరువు కట్టపై గణపతికి ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులతో గణపతి హోమం చేయించారు. ఈ సందర్భంగా మ ంత్రి మాట్లాడుతూ.. మంత్రపురిగా పేరుగాంచిన మంథని అభివృద్ధికి కోసం పాటుపడతానని, పట్టణ రూపురేఖలు మారుస్తానన్నారు. ఈ ప్రాంతా న్ని పారిశ్రామిక వాడగా తీర్చిదిద్దేందుకు కృత నిశ్చయంతో ఉన్నానన్నారు.