calender_icon.png 3 December, 2024 | 10:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మత్స్యకారుల అభివృద్ధి కోసం మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేకమైన చొరవ తీసుకోవాలి

21-11-2024 02:16:36 PM

మంథని లో ప్రపంచ మత్స్యకార దినోత్సవంలో జిల్లా మత్స్యశాఖ డైరెక్టర్

పోతరవేని క్రాంతి

మంథని (విజయ క్రాంతి): ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరించుకొని మంథనిలోని బోయినపేట నుండి అంబేద్కర్ చౌక్ వరకు మత్స్యకారులు గురువారం ర్యాలీ తీశారు. పట్టణంలోని  అంబేద్కర్ చౌక్ లో పలు విన్యాసాలు సాంస్కృతిక కార్యక్రమాలతో ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మత్స్యశాఖ పెద్దపెల్లి జిల్లా డైరెక్టర్ పోతరవేని క్రాంతి మాట్లాడుతూ... సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడంలో మత్స్య కార్మికుల సహకారం ఎంతో ఉందని, సరైన రీతిలో ప్రభుత్వ పథకాలను ఏర్పాటు చేసి మత్స్య కార్మికులను ఆదుకోవాలని కోరారు.  ప్రతి సంవత్సరం నాసిరకం చేప పిల్లలతో మత్స్యకారులు ఎన్నో రకాలుగా నష్టపోతున్నారని, దీనికి బదులుగా నగదు పంపిణీ కార్యక్రమం చేపట్టాలని,  ఉత్తమమైన చాప పిల్లను సకాలంలో మత్స్యకారులకు అందించాలన్నారు. మత్స్యకారులకు సంబంధించి ఇన్సూరెన్స్ లో చేయూత కోసం ప్రభుత్వం ఆలోచన చేసి వీరి అభివృద్ధికి కావలసిన ప్రణాళికను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని క్రాంతి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమం లో సబ్బని సమ్మయ్య, పోలు కనుక రాజ్, అంకరి కుమార్, గంధం వెంకట స్వామి, బయ్యా రాజేష్, కుంట బద్రి, సబ్బనీ సంతు, బొజ్జ శ్రీనివాస్, డిష్ రాజ్, పోలు శివ, మబ్బు నాగరాజ్, గుండా సాగర్, పొలు కృష్ణా, బయ్య జగదీష్, నడిపిరాజ్, జడిగల లక్ష్మణ్, అంకరి శివ పెద్ద ఎత్తున మత్స్య కారులు పాల్గొన్నారు.