మంథని, నవంబర్ 25 (విజయక్రాంతి): మంథని నియోజకవర్గం లోని మంథని, రామగిరి, ముత్తారం, కమాన్‌పూర్ మండలాల్లోని 9 అంగన్వాడీ కేంద్రాలకు రూ. కోటి 8 లక్షలు నిధులను సోమవారం ఐటీ శాఖ మంత్రి, మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు మంజూరు చేయించా రు.
మంథని మండలం బట్టుపల్లి, గుంజపడుగు-2, సూరయ్య పల్లి-1, ముత్తారం మండలం హరిపురం, లక్కారం, రామగిరి మండలం సుందిళ్ల-1, నాగేపల్లి- 3, కమాన్‌పూర్ మండలం ములకలపల్లి, గుండా రం -2 గ్రామాలకు మంజూరైన ప్రతి అంగన్వాడి కేంద్రానికి రూ.12 లక్షలు ఎన్ఆర్ఈజీఎస్ 15 ఫైనాన్స్, ఇతర నిధుల నుంచి జిల్లా కలెక్టర్ 9 అంగన్వాడీలకు కలిపి కోటి 8 లక్షలను మంజూరు చేశారు.