విధానాలు ఆచరణలో పెట్టడమే పెద్ద సవాలు
ఉపాధి అందాలనే కులగణన చేస్తున్నాం
హైదరాబాద్: సమ్మిళిత అభివృద్ధి కోసమే తమ ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర ఐటి శాఖ మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. బ్యాక్ వర్డ్ క్లాసెస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ ఆధ్వర్యంలో టీహబ్ లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ... బలహీనవర్గాల పారిశ్రామికవేత్తల కోసం బిక్కి ఏర్పాటు అభినందనీయమన్నారు. అత్యుత్తమ ఎంఎస్ఎంఈ పాలసీ తీసుకొచ్చామని, విధానాలు ఆచరణలో పెట్టడమే పెద్ద సవాలుగా మారాయని చెప్పారు. రాజకీయ, ఆర్థిక, సామాజిక, ఉపాధి అందాలనే కులగణన చేస్తున్నామని వెల్లడించారు. కులాల వారీగా అందాలనే ఉద్దేశంతో కులగణన చేస్తున్నామని తెలిపారు. ఎన్ని సవాళ్లు వచ్చినా అధిగమిచేలా ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు. బిక్కి ప్రతిపాదనలకు అనుగుణంగా ప్రారిశ్రామిక విధానాల్లో మార్పులు చేస్తున్నామని చెప్పారు. ద్వితీయ, తృతీయశ్రేణి నగరాల్లోనూ పరిశ్రమలు విస్తరించే విధంగా ఏర్పాటు చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.