ముత్తారం,(విజయక్రాంతి): నాణ్యత ప్రమాణాలతో ఉత్తర మండలంలోని ఓడేడు బ్రిడ్జి(Odedu Bridge)ని నిర్మిస్తామని రాష్ట్ర మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబు(Minister Duddilla Sridhar Babu) అన్నారు. ఆదివారం మైదాబండలో విలేకరులతో మాట్లాడుతూ గత బిఆర్ఎస్(BRS) ప్రభుత్వంలో గాలికి కూడిపోయే ప్రాజెక్టులు వంతెనలు నిర్మించాలని, తమ ప్రభుత్వంలో నాణ్యత ప్రమాణాలతో వంతెనలు రోడ్లు బ్రిడ్జిలు నిర్మిస్తున్నామని మంత్రి అన్నారు.
అది ఏండ్లు ఓడేడు బ్రిడ్జి నిర్మించలేక టిఆర్ఎస్ ప్రభుత్వం చేతులు ఎత్తేసిందని, తమ ప్రభుత్వం వచ్చాక టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తున్నామని మంత్రి తెలిపారు, ప్రజలకు రోడ్ల సౌకర్యం ఉంటేనే ఎంతో సౌలభ్యంగా ఉంటుందని, గుర్తించిన కాంగ్రెస్ ప్రభుత్వం మండల కేంద్రం నుంచి ప్రతి గ్రామానికి బీటీ రోడ్డు నిర్మిస్తున్నదని తెలిపారు. మంత్రి వెంట మాజీ జెడ్పిటిసి చొప్పరి సదానందం, కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు దొడ్డ బాలాజీ, నాయకులు తూటి రఫీ, తాటిపాముల శంకర్, బియాని శివకుమార్, మద్దెల రాజయ్య తదితరులు ఉన్నారు