calender_icon.png 30 March, 2025 | 4:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫిర్యాదుల ఆధారంగా సైబర్ క్రైమ్ కేసులు : మంత్రి శ్రీధర్ బాబు

26-03-2025 06:51:41 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ శాసన సభ సమావేశాలు బుధవారం కొనసాగుతున్నాయి. ఈ సమావేశాల్లో భాగంగానే ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ... ఏపీ, తెలంగాణ మధ్య ఢిల్లీలోని ఆస్తుల పంపకం పూర్తయిందని, పటౌడీ హౌస్ భూమిలో తెలంగాణ భవన నిర్మాణం జరుగుతుందని, అందుకోసం త్వరలోనే టెండర్లు పిలిచి తెలంగాణ భవన నిర్మాణం చేపడతామని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. గ్రూప్-1,2,4 పరీక్షలు తెలుగు, ఇంగ్రీష్, ఉర్దూ మూడు భాషల్లోనూ జరుగుతున్నాయని, రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడడంలో భాగంగా పోలీసులు తమ ప్రాణాలను కోల్పోయారని మంత్రి చెప్పారు. పోలీసుల పట్ల గౌరవంగా ఉండాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, ఎక్కడో ఒక చోట జరిగిన పొరపాట్లను సరిదిద్దుకోవాలని, చిన్న చిన్న ఘటనలు మినహా రాష్ట్రంలో పోలీసులు సమార్థవంతంగా పని చేస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు.

హైదరాబాద్ లో హత్యలు పెరిగాయనే అంశాన్ని ప్రతిపక్షాలు సభలో లేవనెత్తాయని, పెరుతున్న హైదరాబాద్ జనాభా మేరకు కేసులు పెరిగాయనేది సత్యదూరమన్నారు. ఫిర్యాదుల ఆధారంగా సైబర్ క్రైమ్ కేసులు నమోదు చేస్తున్నారని, సైబర్ కేటుగాల చేతుల్లో మోసపోయిన బాధితులకు సైబర్ క్రైమ్ పోలీసులు రూ.185 కోట్లు తిరిగి ఇప్పించారని మంత్రి గుర్తు చేశారు. గతంలో బాధితులను భయబ్రాంతులకు గురి చేసి కేసులు నమోదు చేయలేదని, ప్రస్తుతం అలాంటి సమస్య లేకపోవడంతో బాధితులు కేసులు అధికంగా పెట్టాడంతో ఆ సంఖ్య ఎక్కువవుతుందని చెప్పారు. ప్రస్తుతం హోంగార్డు నుంచి డీజీపీ స్థాయి అధికారి వరకు బాధితులకు అందుబాటులో ఉంటున్నారు. యంగ్ ఇండియా పోలీస్ స్కూళ్ల ద్వారా సిబ్బంది పిల్లలకు నాణ్యమైన విద్య అందుతుందని, మంచిరేవులలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారని మంత్రి శ్రీధర్ బాబు వ్యాఖ్యానించారు. షీ టీమ్స్, భరోసా కేంద్రాలను మరింత పటిష్టం చేయడంతో ప్రస్తుతం పోలీసులు స్వేచ్ఛగా కేసులు నమోదు చేస్తున్నారని చెప్పుకోచ్చారు.

గతంలో పాలకులు చెబితేనే కేసుల నమోదు జరిగేదాని, గతంలో హత్య కేసు నిందితులకు పోలీసు స్టేషన్ లో పూజలు చేసి పంపేవారని మంత్రి విరుచుకుపడ్డారు. గతంలో ఓ న్యాయవాది హత్య జరిగితే పోలీసుల ఘనత స్పష్టంగా కనబడిందని, బాధితుల అభిప్రాయాల కోసం అన్ని పోలీస్ స్టేసన్లలో క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేసి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా సీఐడీ విభాగం పర్యవేక్షిస్తుందని శ్రీధర్ బాబు చెప్పారు. కాల్ సెంటర్ ద్వారా సమాచారం సేకరించి పొరపాటు జరిగితే సరిదిద్దుకునే అవకాశం కల్పించమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక యాంటీ నార్కొటిక్ బ్యూరో ఏర్పాటు చేశామని, మాదకద్రవ్యాల ముప్పును అరికట్టేందుకు టీజీ న్యాబ్ ఏర్పాటు చేశామని మంత్రి శ్రీధర్ స్పష్టం చేశారు. టీజీ న్యాబ్ కు మంజూరు చేసిన 429 పోస్టుల్లో 224 భర్తీ చేశామని, టీజీ న్యాబ్ ద్వారా 4,191 కేసులు నమోదు చేసి 9,426 మందిని అరెస్టు చేసి రూ.251 విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసినట్లు గుర్తు చేశారు. డ్రగ్స్ కు వ్యతిరేకంగా సొసైటీల పరంగా 4,729 కమిటీలు ఏర్పాటు చేయడంతో మాదకద్రవ్యాల వ్యతిరేక సైనికులుగా 10,200 మంది పేర్లు నమోదు చేసి 2,223 కేసుల్లో పాల్గొన్న 27 మంది సైబర్ నేరస్థులను అరెస్టు చేశామన్నారు.