calender_icon.png 18 November, 2024 | 4:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆ ఇద్దరూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే.. అంతర్గత విభేధాలతో కొట్టుకున్నారు..

14-09-2024 04:23:56 PM

హైదరాబాద్: అర్హులైన రైతులందరికీ రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. సాంకేతిక సమస్యలతో కొందరికి రుణమాఫీ కాలేదని తెలిపారు. రూ. లక్ష రుణమాఫీ చేసేందుకు బీఆర్ఎస్ ఐదేళ్లు తీసుకుందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒకే దఫాలో రూ. 2 లక్షల రుణమాపీ చేశామని చెప్పారు. నిన్న ఇద్దరు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కొట్టుకుంటే.. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆ ఇద్దరూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే.. వారి అంతర్గత విభేధాలతో కొట్టుకున్నారని మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఘర్షణను కాంగ్రెస్ కు అంటగడుతున్నారని మంత్రి ఫైర్ అయ్యారు. పెద్దపల్లి జిల్లాలో పర్యటించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్వాసితులకు రూ. 18 కోట్ల పరిహరం చెక్కు అందజేశారు.