calender_icon.png 8 January, 2025 | 2:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా పాలనకు విఘ్నాలు తొలగాలి

15-09-2024 07:38:37 PM

తెలంగాణ బ్రాండ్ను పది రెట్లు పెంచుతాం

మంథనిలో మహా గణపతి హోమంలో దంపతుల ప్రత్యేక పూజలు

మంథని,(విజయక్రాంతి): మహా వీరా... నమో నమః ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రజా పాలనకు అడుగడుగునా ఎదురవుతున్న విఘ్నాలు తొలగిపోయి. ప్రజా సంక్షేమం నిర్విఘ్నంగా కొనసాగాలనీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. మంత్రి పట్టణంలోని రావుల చెరువు కట్టాలోని గణేష్ మండపంలో వందేళ్లు పూర్తి చేసుకున్న గజానన మండలిలో లోక కల్యాణార్థం ఆదివారం మహా గణపతిహోమం నిర్వహించారు. వేడ పండితుల మంత్రోచ్ఛారణతో మంత్రపురికి శోభాయమానం సంతరించుకున్నది. మంత్రి శ్రీధర్ బాబు-శైలజ దంపతులు ముఖ్యాతిథిగా హోమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని, ఈ ప్రయాణంలో ఏలాంటి విఘ్నాలు కలగకుండా విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. అనంతరం మహాలక్ష్మి ఆలయంలో వారిరువురు ప్రత్యేక పూజలు చేశారు.