మంథని,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రజలు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ధన్వాడ గ్రామంలోని శ్రీ దత్తాత్రేయ స్వామి దేవాలయంలో దత్త నవరాత్రుల సందర్భంగా రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు శైలజ రామయ్య దంపతులు ప్రత్యేక పూజలు అభిషేకాలను నిర్వహించారు. స్వామివారి ఉత్సవ విగ్రహానికి పంచామృతాలు పండ్లరసాలతో అర్చకుల వేదమంత్రాలు మధ్య అభిషేకాలను చేశారు. స్వామివారి మూలవిరాట్ కు విశేష ఉపచార పూజలు నిర్వహించి దూపదీప నైవేద్యాలను సమర్పించారు. దేవాలయ ప్రాంగణంలో నిర్వహించిన లక్ష్మీ గణపతి దత్త హోమంలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ అర్చకులు మంత్రి దంపతులకు తీర్థప్రసాదాలను అందజేసి వేద ఆశీర్వచనం అందించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు దేవాలయానికి విచ్చేసి దత్తుని సేవలో తరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, దత్తాత్రేయ స్వామి ఆశీస్సులు ప్రతి ఒక్కరుపై ఉండాలని వేడుకున్నట్లు ఈ సందర్భంగా శ్రీధర్ బాబు తెలిపారు.