calender_icon.png 15 January, 2025 | 9:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పొన్నం సత్తయ్య గౌడ్‌కు నివాళులు అర్పించిన మంత్రి శ్రీధర్ బాబు

09-09-2024 06:13:07 PM

కరీంనగర్,(విజయక్రాంతి): రవాణా, బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ తండ్రి పొన్నం సత్తయ్య గౌడ్ 14వ వర్ధంతి కార్యక్రమం కరీంనగర్ లో వారి తోటలో జరిగింది. పొన్నం సత్తయ్య గౌడ్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్  నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ,  మనోహర్ రెడ్డి, మక్కన్ సింగ్ ఠాకూర్, ఎంపి సురేష్ షెట్కర్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, సిరిసిల్ల కాంగ్రెస్ ఇంచార్జి కేకే మహేందర్ రెడ్డి, కరీంనగర్ ఇంచార్జి పురుమల్ల శ్రీనివాస్, సిద్దిపేట డిసిసి అధ్యక్షులు తుంకుంట నర్సారెడ్డి, కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి, సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, హుస్నాబాద్, కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు, అధికారులు పాల్గొన్నారు.