02-03-2025 11:51:13 AM
మంథనిలో శ్రీపాద జయంతి వేడుకల్లో మంత్రి శ్రీధర్ బాబు
మంథని,(విజయక్రాతి): తన తండ్రి ఆశయ సాధన కోసం నిరంతరం కృషి చేస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. మంథని పట్టణంలోని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ స్వర్గీయ శ్రీపాద రావు (88 )జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ... మంత్రి ప్రాంతానికి ఎందరో మహానుభావులు గుర్తించారని అందులో మాజీ ప్రధాని పివి నరసింహారావు, మాజీ జిల్లా జడ్పీ చైర్మన్ కిషన్ రావు తన తండ్రి శ్రీపాదరావు మంథనికే కాకుండా రాష్ట్రానికి దేశానికి ఎంతో సేవ చేశారని కొనియాడారు.
అనంతరం శ్రీఫాదరావు విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ... తన తండ్రి ఆశయ సాధన కోసం నిరంతరం కృషి చేస్తున్నామని, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరింత పనిచేసే తన తండ్రి ఆశయాలను కొనసాగిస్తామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ పెండ్రు రమాదేవి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆయిలి శ్రీనివాస్, యూత్ అధ్యక్షులు సాదుల శ్రీకాంత్, నాయకులు ఒడ్నాల శ్రీనివాస్, శశి భూషణ్ కాచే, పోలు శివ, సురేందర్ రెడ్డి, కొండ శంకర్, లింగయ్య యాదవ్, కుడుదుల వెంకన్న, గోటికర్ కిషోన్ జీ, రాజు తదితరులు పాల్గొన్నారు.