27-02-2025 10:59:33 AM
సాగు నీటి కెనాల్ పరిశీలినలో మాజీ జడ్పిటిసి సదానందం, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాలాజీ
ముత్తారం, (విజయక్రాంతి): ముత్తారం మండల రైతులకు సాగనీరు అందేలా మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాలు అధికారులు జారీ చేశారని ముత్తారం లో సాగు నీటి కెనాల్ పరిశీలినలో మాజీ జడ్పిటిసి చొప్పరి సదానందం, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొడ్ల బాలాజీ లు తెలిపారు. గురువారం ముత్తారం నుండి అడవి శ్రీరాంపూర్ గ్రామానికి సాగునీరు వచ్చే కెనాల్ కొందరు రైతులు అభ్యంతరాలు తెలపడంతో రైతులకు సాగు నీళ్లు రావడంలేదని రైతులు తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు దృష్టికి తీసుకువెళ్లగా మంత్రి ఆదేశానుసారం కాంగ్రెస్ నాయకులు కెనాల్ వద్దకు వెళ్లి పరిశీలించారు.
రైతులకు సాగునీరు ఏలా అందించాలని, అడవి శ్రీరాంపూర్ కు సాగునీరు అందించాలని ఉన్నతాధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా అధికారులు వచ్చి పరిశీలించి సమస్య పరిష్కారం చేయవలసిందిగా మంత్రి శ్రీధర్ బాబు ఆదేశించారని వారు తెలిపారు. త్వరలోనే రైతులకు నీళ్లు అందేలా ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్పీ సెల్ ఉపాధ్యక్షుడు మద్దెల రాజయ్య, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బక్కతట్ల వినీత్ యాదవ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు తూటీ రఫీ, ముత్తారం మండల కిసాన్ సెల్ అధ్యక్షులు గాదం శ్రీనివాస్, ముత్తారం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు అనుము సమ్మయ్య, తదితరులు పాల్గొన్నారు