మంథనిలో అమృత్-2 పథకం పనుల శంకుస్థాపన లో మంత్రి శ్రీధర్ బాబు
మంథని,(విజయక్రాంతి): మంథని అభివృద్ధి, సంక్షేమమే నా ద్వేయమని మంథనిలో అమృత్-2 పథకం పనుల శంకుస్థాపనలో రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు అన్నారు. సోమవారం అమృత్ - 2 పథకంలో భాగంగా రూ. 12 కోట్ల 10 లక్షల వ్యయంతో మంథని పట్టణం పోచమ్మ వాడ వద్ద నిర్మించనున్న 8 లక్షల లీటర్ల కెపాసిటీ గల వాటర్ ట్యాంక్ తో పాటు 25 కిలో మీటర్ పైప్ లైన్ నిర్మాణ పనులకు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, అదనపు కలెక్టర్ జే.అరుణశ్రీ, మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పెండ్రు రమాసురేష్ రెడ్డి, ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ శ్రీపది బానయ్య, కమిషనర్ మల్లికార్జున స్వామి, కౌన్సిలర్లతో పాటు నాయకులు పాల్గొన్నారు.