02-04-2025 04:44:35 PM
శివారం గోదావరి నదిపై బ్రిడ్జి ఏర్పాటుతో వ్యాపారం అభివృద్ధి చెందుతుంది..
పెద్దబాలశిక్ష చదివిన వాళ్ళకి ఏం తెలుస్తుంది అభివృద్ధి అంటే..
పది ఏండ్లు అధికారంలో ఉన్నప్పుడు ఆరెందపై బ్రిడ్జి నిర్మాణం గుర్తుకు రాలేదా పుట్ట..
మంథనిలో విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఐలి ప్రసాద్, ప్రచార కమిటీ అధ్యక్షులు ఒడ్నాల శ్రీనివాస్..
మంథని (విజయక్రాంతి): మంథని అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా మంథని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పని చేస్తున్నారని, మంథని-శివారం గోదావరి నదిపై బ్రిడ్జి ఏర్పాటుతో వ్యాపారం అభివృద్ధి చెందుతుందని, పెద్దబాలశిక్ష చదివిన వాళ్ళకి అభివృద్ధి అంటే ఏం తెలుస్తుందని, పది ఏండ్లు అధికారంలో ఉన్నప్పుడు ఆరెందపై బ్రిడ్జి నిర్మాణం గుర్తుకు రాలేదా అంటూ మాజీ ఎమ్మెల్యే జడ్పీ చైర్ పర్సన్ పుట్ట మధును వారు ప్రశ్నించారు.
మంథనిలో బుధవారం విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఐలి ప్రసాద్, ప్రచార కమిటీ అధ్యక్షులు ఒడ్నాల శ్రీనివాస్, మంథని సత్యం, జిల్లా ప్రధాన కార్యదర్శి కుడుదుల వెంకన్న, మాజీ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎరుకల ప్రవీణ్ మాట్లాడుతూ... మంథని ప్రాంత అభివృద్ధి కోసం మంత్రి శ్రీధర్ బాబు నిరంతరం అభివృద్ధి పనులు చేస్తుంటే, ఓర్వలేక విషం కక్కుతూ, ఇష్టం వచ్చినట్టు పుట్ట మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ పత్రిక, మీడియాకు కనబడాలని ఉద్దేశంతో పుట్ట మధు ఉన్నారని వారు ఆయనపై మండిపడ్డారు.
మంథని- శివారం గోదావరి నదిపై బ్రిడ్జి ఏర్పాటు చేయడం వల్ల ఈ ప్రాంత ప్రజలకు, వ్యాపారులకు చిన్న, సన్నగా రైతులకు కూరగాయలు గాని ప్రతి ఒక్క వస్తువు అమ్ముకుని జీవన ఉపాధి పొందుతున్నారని, నీకు జ్ఞానం లేదని పెద్ద బాలశిక్ష ఫోస్ట్ ద్వారా పంపిస్తామని జ్ఞానం పెంచుకోవాలని సూచించారు. మంత్రి శ్రీధర్ బాబు మంథనిలో జన్మించారని, శివారం పరిసర ప్రాంత ప్రజలు మంథనికి వస్తువులుగాని, ఎరువులు గాని ఇతరత్రా పనుల కోసం వస్తు వెళ్తుంటారని బ్రిడ్జి ద్వారా ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని, ఆరెంద గ్రామం వద్ద, బోయిన్ పేట వద్ద బ్రిడ్జి నిర్మాణం చేయలని అంటున్నావు కదా... మరి 10 ఏండ్లు నువ్వేం చేశావని, అధికారం పోయకా అభివృద్ధి గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నించారు.
రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నది ఎవరో మంథని నియోజకవర్గ ప్రజలకు తెలుసునని తెలిపారు. ఆరెంద, బోయిన్ పేట బ్రిడ్జి మంత్రి శ్రీధర్ బాబు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు తెలిపారు. అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే ప్రజలు బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు పాల్గొన్నారు.