24-03-2025 12:07:42 AM
కమాన్ పూర్, మార్చి 23 (విజయక్రాంతి): కమాన్ పూర్ మండల కేంద్రంలో ప్రతి ఉగాదికి నిర్వహించే ఉత్సవాలకు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు ఆలయ ఈవో కాంతరెడ్డి ఆహ్వాన పత్రం ఆదివారం అందజేశారు.
ఈనెల 30న ఆదివారం రోజున విశ్వా వసు నామ సంవత్సర తెలుగు వారి నూతన సంవత్సరం వేడుకలు ఆదివారం స్వామి ప్రాంగణంలో జరగనున్నాయని, నిత్యారాధన అభిషేకం, అదేరోజు ఉగాది ప్రసాద వితరణ, ఉదయం 11 గంటలకు పంచాంగ శ్రవణం నిర్వహించబడుతుందని ఈవో కాంత రెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు కలకుంట్ల వరప్రసాదాచార్యులు తెలిపారు. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు తప్పనిసరిగా హాజరు కావాలని మంత్రిని కోరారు.