calender_icon.png 15 November, 2024 | 3:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వారంలోపు బోనస్: మంత్రి శ్రీధర్ బాబు

15-11-2024 12:56:24 PM

ఆర్థికకష్టాలు ఉన్నా.. రైతులకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాం

హైదరాబాద్: రైతుల దగ్గర నుంచి సన్న ధాన్యం సేకరించిన వారంలోపు బోనస్ చెల్లిస్తామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు శ్రీధర్ బాబు ప్రకటించారు. బీఆర్ఎస్ నేతలు రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసిందని ఆరోపించారు. ఆర్థికకష్టాలు ఉన్నా.. రైతులకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నామని సూచించారు. రైతులకు హామీ ఇచ్చిన ప్రకారం సన్న ధాన్యానికి బోనస్ ఇస్తామన్నారు. రైతుల కష్టాలపై బీఆర్ఎస్ నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారని ధ్వజమెత్తారు.  రైతులకు మేలు చేసేందుకు ఏదైనా సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరామన్నారు. ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారని శ్రీధర్ బాబు ఫైర్ అయ్యారు. 66,77 లక్షల ఎకరాల్లో 146 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అయ్యిందన్నారు. రైతులపై బీజేపీకి ప్రేమ ఉంటే తేమ శాతం నిబంధనలు మార్చాలని ఆయన కోరారు.