calender_icon.png 27 January, 2025 | 3:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాలకవర్గాన్ని సన్మానించిన మంత్రి శ్రీధర్ బాబు సోదరుడు శ్రీనుబాబు

26-01-2025 08:12:42 PM

మంథని (విజయక్రాంతి): నేటితో మంథని మున్సిపల్ కౌన్సిల్ సభ్యుల పదవికాలం అయిపోతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ పెండ్రు రమ-సురేష్ రెడ్డి, పాలకవర్గాన్ని మంత్రికి శ్రీధర్ బాబు సోదరులు దుద్దిళ్ల శ్రీనుబాబు సన్మానించారు. ఈ సందర్భంగా శ్రీను బాబు మాట్లాడుతూ... గత పాలకులు నాలుగు సంవత్సరాలలో చేయలేనిది, మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మంథని పట్టణ అభివృద్ధిని చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని, అభివృద్ధిలో ఎక్కడ కూడా వెనకడుగు వేయడం లేదన్నారు. ప్రజలకు సేవలు చేయడానికి రాష్ట్ర ఐటీ మంత్రి శ్రీధర్ బాబు కృషి చేస్తా ఉన్నారని తెలిపారు. కౌన్సిల్ సభ్యులకు పదవికాలం ముగుస్తా ఉన్న తరుణంలో వారు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజలకు సేవ అందించాలని వారి యొక్క ఆలోచనలతో ముందుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆయిలి ప్రసాద్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ ఎస్సీ సెల్ బీసీ సెల్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.