calender_icon.png 7 April, 2025 | 8:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కన్నుల పండుగగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం

06-04-2025 05:49:58 PM

శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకలు చూసి పునీతులైన భక్తులు..

భక్తులతో కిటకిటలాడిన శ్రీ సీతారాముల కళ్యాణ మండపాలు..

గ్రామ గ్రామాల్లో శ్రీ సీతారామచంద్రుల కళ్యాణం వేడుకల్లో మంత్రి శ్రీధర్ బాబు.. సోదరుడు శ్రీను బాబు..

మంథని (విజయక్రాంతి): శ్రీ విశ్వావసు నామ సంవత్సరం శుక్లపక్షం నవమి తిథి అయిన ఆదివారం లోకకళ్యాణార్థం శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకలను పెద్దపల్లి జిల్లాలో భక్తులు కన్నుల పండుగగా నిర్వహించారు. మంథని నియోజకవర్గం(Manthani Constituency)లో శ్రీ సీతారామ చంద్రుల కళ్యాణ వేడుకలకు తిలకిడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి కళ్యాణ వేడుకలను చూసి పునీతులయ్యారు. మంథని నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాల్లో ఈ ఆలయ వేడుకలు నిర్వహించారు. మంత్రి స్వగ్రామం ధన్వాడలో మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu)తో పాటు సోదరుడు శ్రీనుబాబు కళ్యాణంలో పాల్గొన్నారు. సీతరామల కళ్యాణం చైత్రశుద్ద నవమి సందర్భంగా నిర్వహించే కల్యాణ వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్బంగా ఉదయం ముహూర్త సమయానికి ప్రారంభమయ్యే కళ్యాణ వేడుకలు వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వారికి విశేషంగా నిత్యపూజలు, అభిషేకం, అర్చనలు, హారతి, మంత్రపుష్పంతో ప్రారంభమై ఉదయం 9-30 నుండి కళ్యాణ వేదికపై శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకలకు నిర్వహించారు. మంథని పట్టణంలోని గోదావరి నది తీరంలో గల శ్రీ కోదండ రామాలయంలో, శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో, శ్రీరామ నగర్ లోని రామాలయంలో, ఖమ్మంపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ రామాలయంలో, ఎగ్లాస్పూర్ గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో అలాగే అన్ని గ్రామాల్లోని కళ్యాణ వేడుకలు నిర్వహించారు. అనంతరం వచ్చిన భక్తులకు పానకం, వడపప్పు మహాప్రసాదంగా అందజేశారు. భక్తులు అధికసంఖ్యలో పాల్గోని సీతారాముల కళ్యాణ అనంతరం అన్నదాన కార్యక్రమంలో స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు.

శ్రీ సీతారామచంద్రుల కళ్యాణం యొక్క ప్రాముఖ్యత:

సత్యానికి న్యాయానికి ధర్మానికి ప్రతిరూపమైన శ్రీ సీతారామచంద్రుల కల్యాణ వేడుకలు దేశంలోని అన్ని ప్రాంతాల్లో గ్రామాల్లో నిర్వహిస్తుండడం సంప్రదాయంగా వస్తుంది. అందుకే రామరాజ్యం రావాలి అని అందరూ కోరుకుంటున్నారు. పాతివ్రత్యానికి సీతాదేవి, పితృ వాక్య పరిపాలనకు రామచంద్రుడు చిరస్థాయిగా నిలిచిపోయారు. శ్రీరాముని దివ్య చరిత్రను కీర్తించిన వాల్మీకి ధన్యుడయ్యారు. మానవజాతిని తీర్చిదిద్ది ధార్మిక జీవనం ఎంత మహోన్నతమైనదో రామాయణం ద్వారా బోధపడుతుంది. అందుకొరకే భారతీయులందరూ శ్రీరామచంద్రుని ఆరాధ్య దైవంగా పూజిస్తారు. శ్రీ మహావిష్ణు రామావతారం చైత్ర శుద్ధ నవమితి పునర్వసు నక్షత్రం రోజున జన్మించారు. శ్రీ రామ జపాన్ని పఠిస్తే అంతా శుభం జరుగుతుంది. శ్రీరాముడు అయోధ్యలో జన్మించి అయోధ్య వాసులను తరింపజేశారు.