calender_icon.png 30 September, 2024 | 7:45 AM

రాష్ట్రపతితో మంత్రి సీతక్క భేటీ

29-09-2024 02:09:59 AM

ములుగు మున్సిపాలటీ బిల్లును ఆమోదించాలని విజ్ఞప్తి

హైదరాబాద్, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతి ద్రౌపతిముర్ము తో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖమంత్రి సీతక్క ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ములుగు గ్రామపంచాయతీని మున్సిపాలిటీగా మార్చే బిల్లుకు ఆమోదం తెలపాలని రాష్ట్రపతికి వినతిపత్రం అందించారు.

రెండే ళ్లుగా రాష్ట్రపతి కార్యాలయంలో ములుగు మున్సిపాలిటీ బిల్లు పెండింగ్‌లో ఉందని, ఆమోదిస్తే ములుగుకు మున్సిపాలిటీ హోదా దక్కుతుందని సీతక్క రాష్ట్రపతికి వివరించారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి ఢిల్లీకి తిరుగుప్రయా ణమయ్యే వరకు రాష్ట్రపతి పర్యటన ఆద్యంతం మినిస్టర్ ఇన్ వెయిటింగ్ హోదాలో మంత్రి సీతక్క రాష్ట్రపతి వెంటే ఉన్నారు.

బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో భారతీయ కళా మహోత్సవ కార్యక్రమాన్ని రాష్ట్రపతి ప్రారంభించగా అదే వేదిక నుంచి మంత్రి సీతక్క ప్రసగించారు. ఈశాన్య రాష్ట్రాల సంప్రదాయ నృత్యాలతో కళా మహోత్సవ కార్యక్రమం కొనసాగటం పట్ల సీతక్క హర్షం వ్యక్తం చేశారు.

ఏ స్థాయికి ఎదిగినా తమ మూలాలను మరిచిపోవద్దని, సంస్కృతీ సంప్రదాయాల వారసత్వాన్ని భవిష్యత్ తరాల కు అందించాలన్నారు. హైదరాబాద్ పర్యటన ముగించుకొని ఢిల్లీ బయలుదేరిన రాష్ట్రపతికి బేగంపేట విమా నాశ్రయంలో తెలంగాణ పల్లె సంస్కృ తి ఉట్టిపడే పెయింటింగ్‌ను మంత్రి సీతక్క బహూకరించారు.