calender_icon.png 23 February, 2025 | 9:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మణుగూరులో మంత్రి సీతక్క..

23-02-2025 04:45:20 PM

మణుగూరు (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని శేషగిరినగర్ లో మంత్రి సీతక్క(Minister Sitakka) పీఎ బండారి సతీష్ ఇంట్లో జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు ధనసరి అనసూయ(సీతక్క), పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లులు(MLA Payam Venkateshwarlu) పాల్గొన్నారు.

ఫైర్ బ్రాండ్ మంత్రి సీతక్క మణుగూరు వచ్చిన విషయం తెలుసుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున సీతక్కను కలిశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిరినకి నవీన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అశ్వాపురం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళ నేతలు, అనుబంధ సంఘాల నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.