ఆదిలాబాద్ (విజయక్రాంతి): నాగోబా జాతరలో ఆదివాసీ సంస్కృతీ, సాంప్రదాయం ఉట్టి పడింది. మెస్రం వంశీయులే కాకుండా జాతర కొచ్చిన అతిధులు సాంప్రదాయ వస్త్ర ధారణతో ఆకట్టుకున్నారు. ఆదివాసీల సాంప్రదాయ కట్టు, బొట్టు, ఆభరణాలతో మంత్రి సీతక్క ఆకట్టుకున్నారు. అదేవిధంగా సంప్రదాయ వస్త్రాలు లాల్చీలు ధోవతులతో ఎమ్మెల్సీ విఠల్, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, జీసీసీ చైర్మన్ కొట్నాక్ తిరుపతి, కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేష్ తదితరులు జాతరలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ముందుగా మంత్రి సీతక్క నాగోబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నాగోబా దర్బార్ లో ఆమె పాల్గొన్నారు. అంతకుముందు ఇంద్రవెల్లిలోని అమరవీరుల స్తూపం వద్ద అమరులకు నివాళులర్పించారు.