మంథనిలో వినాయక మండపాల దర్శనాలలో మంత్రి శ్రీధర్ బాబు
మంథని,(విజయక్రాంతి): తాను తక్కువ మాట్లాడి పని ఎక్కువ చేస్తానని శనివారం రాత్రి మంథని పట్టణంలో వినాయక మండపాల దర్శనాలలో మంత్రి దుదిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. పట్టణంలోని పలు వీధుల్లో ఏర్పాటు చేసిన గణేష్ మండపాలను సందర్శించి విగ్నేశ్వర స్వామికి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు చేశారు. అదేవిధంగా రావుల చెరువు కట్ట వీధిలో ఏర్పాటు చేసిన వినాయక శతవసంత ఉత్సవాలు కార్యక్రమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్ర భాష సంస్కృతిక సంస్థ వారి ఆధ్వర్యంలో ప్రభుత్వ కళాకారుడు ప్రభాకర్ రెడ్డి నృత్య ప్రదర్శనను తిలకించారు. స్థానిక చిన్నారులు నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాలను తిలకించిన మంత్రి వారిని శలువాలతో సన్మానించి అభినందించారు. ఈ సందర్భం శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. రావులచెరువు కట్ట గజానన మండ శతా వసంత ఉత్సవాలలో పాల్గొనడం సంతోషకరంగా ఉందన్నారు. మంత్రి వెంట కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు లు పాల్గొన్నారు.