కుమ్రంభీం బాటలోనే తెలంగాణ ఉద్యమ పోరాటం
పంచాయతీరాజ్, మహిళా శిశు, సంక్షేమ శాఖ మంత్రి దాసరి అనసూయ (సీతక్క)
కుమ్రంభీం అసిఫాబాద్,(విజయక్రాంతి): విల్లంబుల వీరుడి పోరాట స్ఫూర్తితో అభివృద్ధి చేపట్టడం జరుగుతుందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) తెలిపారు. సోమవారం జిల్లాలో చేపట్టిన పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే, ఎమ్మెల్సీ దండే విట్టల్, ఎమ్మెల్యేలు కోవలక్ష్మి వెడ్మ బొజ్జు, అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్ తో కలిసి భూమి పూజ చేశారు. రెబ్బెన మండలం గంగాపూర్ గ్రామం వెంకటేశ్వర స్వామి ఆలయ దారిలో రూ: 10 లక్షల వ్యయంతో నిర్మించనున్న స్వాగత తోరణం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ఆసిఫాబాద్ పట్టణం జనకాపూర్ లో రూ.1.35 కోట్లతో బాల సదన్ భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు.వాంకిడి మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలను జూనియర్ కాలేజ్ గా అప్ గ్రేడ్ చేశారు.జన్కాపూర్ లో రూ: 19 లక్షలతో నిర్మించిన ఆదర్శ అంగన్వాడీ భవనం ప్రారంభించారు. రోడ్డు భద్రత మసోత్సవంలో భాగంగా హెల్మెట్ పంపిణీ చేసి ర్యాలీ ప్రారంభించారు.అనంతరం కెరమేరి మండలంలో జోడేఘాట్ లో రూ: 4 కోట్ల 96 లక్షలతో పర్యాటక అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.కోట పరందోలి గ్రామంలోని జంగుబాయి పుణ్య క్షేత్రం వద్ద సంప్రదాయ పద్ధతిలో ప్రత్యేక పూజలు చేపట్టారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆదివాసీల హక్కుల వెనుక జల్ జంగిల్ జమీన్ కోసం పోరాటం చేసిన భీమ్ ప్రాణ త్యాగాలు ఉన్నాయన్నారు. చరిత్రను తిరిగి రాసిన జోడేఘాట్ ప్రాంతాన్ని చారిత్రాత్మకమైన టూరిజం ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. భీమ్ వర్ధంతి ,జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఈ ప్రాంత ఆదివాసీల డిమాండ్ మేరకు అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వాలు ముందుకు వెళుతున్నారు. సందర్శనకు వచ్చే పర్యాటకులకు భీమ్ చరిత్ర తెలియజేయడంతో పాటు ఆయన స్ఫూర్తిని తెలియదేశాల అభివృద్ధి చేయడం నేటి సమస్యతో ఆదివాసీలో వ్యవసాయం లో ఇబ్బందులు పడుతున్నారని. తెలంగాణ పోరాటం కూడా భీమ్ స్ఫూర్తితోనే ముందుకు వెళ్లడం జరిగింది ఆదివాసీలను విద్యలో ముందుకు చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు.
ట్రైబల్ అడ్వైజరి కమిటీ సమావేశం ఏర్పాటు చేసుకొని ఆదివాసీల అభివృద్ధికి సంక్షేమానికి తీసుకోవాల్సిన అంశాలపై చర్చించి ప్రణాళికను తయారు చేయడం జరుగుతుందన్నారు. అనంతరం ఆదివాసీలకు దుప్పట్లు పంపించేశారు. రోడ్డు భద్రత మహోత్సవంలో భాగంగా ఆసిఫాబాద్ లో మాట్లాడుతూ... వాహనదారులు మద్యం సేవించి నడపడంతో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని రోడ్డు ప్రమాదాల నివారణకు వ్యక్తిగత భద్రత అవసరమని బార్లకు వెళ్లి వేలాది రూపాయలు ఖర్చు పెట్టడం కంటే హెల్మెట్ ధరించి వాహనం నడపాలని సూచించారు. ప్రమాద రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు వాహనదారులు భాగస్వామ్యం కావాలని కోరారు. ఎస్పీ డివి శ్రీనివాసరావు పర్యవేక్షణలో ఏఎస్పీ చిత్తరంజన్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు చేపట్టారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆత్రం సుగుణ, నియోజకవర్గ ఇన్చార్జ్ అజ్మీర శ్యాం నాయక్, సంబంధిత శాఖల అధికారులు, ఆదివాసి సంఘం నాయకులు పాల్గొన్నారు.