హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణలో కుల, ఆర్థిక ఆధారిత సర్వేకు పట్లుదలతో ముందుండిన సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీకి మంత్రి సీతక్క ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గురువారం మహరాష్ట్ర నుంచి మంత్రి సీతక్క వీడియో సందేశంలో తెలంగాణలో ప్రారంభమైన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో అంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. కుల, ఆర్థిక సర్వే విధాన సంస్కరణలు, సామాజిక న్యాయం కోసం చాలా ముఖ్యమైనదని మంత్రి పేర్కొన్నారు.ఈ సర్వేతో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని, సాంఘిక న్యాయం, క్రమబద్ధమైన విధాన పరమార్పులకు కీలకమైన అడుగన్నారు. తెలంగాణలోని ప్రతి ఒక్కరూ చురుకుగా పాల్గొనాలని, ఎన్యుమరేటర్లకు సరైన వివరాలను అందించి సమానత్వం సమగ్రతతో కూడిన భవిష్యత్తును నిర్మించేందుకు సహకరించాలని సీతక్క కోరుతున్నాను. ఈ సర్వేతో సమగ్ర భవిష్యత్తును నిర్మించుకుందాం అని సూచించారు.