calender_icon.png 19 April, 2025 | 11:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంద్రవెల్లి సభ కరపత్రాలను ఆవిష్కరించిన మంత్రి సీతక్క...

19-04-2025 07:56:36 PM

నిషేదాజ్ఞలు ఎత్తివేయడం హర్షణీయం అన్న మాజీ ఎంపీ సోయం..

ఆదిలాబాద్ (విజయక్రాంతి): ఇంద్రవెల్లి కాల్పుల ఘటనలో అమరులైన వీరులను స్మరించి వారికి నివాళులర్పించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రభుత్వ హయంలో అధికారికంగా సంస్కరణ సభ నిర్వహించడం పట్ల మాజీ ఎంపీ సోయం బాపురావు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం ఆదిలాబాద్ లో మంత్రి సీతక్క(Minister Seethakka)ను కలిసి ఇంద్రవెల్లి సభ సంబంధించిన కరపత్రాలను విడుదల చేసి, సభ ఏర్పాట్లపై చర్చించారు.

2004లో తాను ఎమ్మెల్యేగా గెలిచిన రోజే రాత్రి 11 గంటల సమయంలో ఇంద్రవెల్లి స్తూపం వద్ద కొబ్బరికాయ కొట్టి నివాళులు అర్పించడం జరిగిందని, అప్పుడే తొలి అడుగు పడిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆదివాసుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా నిషేధం ఎత్తివేయడం అధికారికంగా సభ నిర్వహించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం జరిగే సంస్కరణసభకు ఆదివాసులు పెద్ద ఎత్తున తరలి రావాలని సోయం బాపూరావు కోరారు.