09-12-2024 01:44:02 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజు ప్రారంభమై కొనసాగుతున్నాయి. సభలో మంత్రి సీతక్క మాట్లాడుతూ.. తెలంగాణ బిడ్డల అస్థిత్వాన్ని ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహం ఉందని, కానీ తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణపైనా విపక్షాలు రాజకీయం చేస్తున్నాయన్నారు. పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రగీతం, తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించలేదని ఆరోపించారు. జయ జయహే తలంగాణ గీతాన్ని వింటుంటే మనస్సు పులకరిస్తుందని, తెలంగాణ బిడ్డలు మట్టిబిడ్డలు, గట్టిబిడ్డలు అని మంత్రి సీతక్క పేర్కొన్నారు. కాంగ్రెస్ అంటేనే మహిళలను గౌరవించే ప్రభుత్వామని, ఉచిత బస్సు ప్రయాణానికి రూ.4 వేల కోట్లు ఖర్చు పెట్టిందని తెలిపారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల్లోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు మంత్రి సీతక్క స్పష్టం చేశారు.