calender_icon.png 17 March, 2025 | 5:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం

17-03-2025 11:12:12 AM

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు(Telangana Assembly Budget Sessions) ప్రారంభమై కొనసాగుతున్నాయి. పంచాయతీరాజ్, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క(Minister Seethakka speech) మాట్లాడుతూ.. 8-10 తరగతి విద్యార్థులకు నెలకు రూ. 1540 డైచ్ ఛార్జీలు చెల్లిస్తున్నాం,  ఇంటర్ నుంచి పీజీ విద్యార్థులకు నెలకు రూ. 2100 డైట్ ఛార్జీలు చెల్లిస్తున్నామని చెప్పారు. విద్యార్థుల డైట్ ఛార్జీలను రూ. 499.51 కోట్లు ఖర్చు చేశామన్నారు. గత ప్రభుత్వంతో పోలిస్తే విద్యార్థుల డైట్ ఛార్జీలు పెంచమని మంత్రి తెలిపారు. విద్యార్థుల కాస్మెటిక్ ఛార్జీలు కూడా 212 శాతం పెంచామని మంత్రి వెల్లడించారు. పిల్లలకు పౌష్టికాహారం అందించాలనేది ప్రభుత్వ ఉద్దేశం అన్నారు. విద్యకు ప్రభుత్వం ప్రాధ్యాన్యం ఇస్తోందన్నారు. కల్తీ ఆహారం వంటి ఘటనలపై వెంటనే చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. మహిల ఐఏఎస్ అధికారులు నైట్ హాల్ట్ చేయాలని చెప్పాం, వివిధ హోదాల్లోని రాజకీయ నాయకులు కూడా నైట్ హాల్ట్ చేస్తున్నారు.

ఎనిమిదో తరగతి వరకు అందించే స్కాలర్ షిప్(Scholarship) లను కేంద్రం 2022లో నిలిపివేసిందని సీతక్క తెలిపారు. కేంద్రం డైట్, ఛార్జీలు, స్కాలర్ షిప్ ల నిలిపివేతతో రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడిందన్నారు. విదేశీ విద్య పథకాన్ని రాజకీయం చేయాలనేది గంగుల కమలాకర్ తపన అని మంత్రి సీతక్క వెల్లడించారు. తాను మాట్లాడిన దాంట్లో తప్పులు ఉన్నాయని చెబుతున్నారు. విదేశీ విద్య పథకం కింద 1913 మంది చదువుతున్నారు. కాంగ్రెస్ వచ్చాక 210 మంది ఎస్సీలు, 300 మంది బీసీ విద్యార్థులు, 100 మంది ఎస్టీలు, 500 మంది మైనార్టీ విద్యార్థులు ఎంపికయ్యారని చెప్పారు. విదేశీ విద్య పథకం మొత్తం 1,110 మంది విద్యార్థుల ఎంపిక జరిగిందని మంత్రి వివరించారు. విదేశీ విద్య పథకం కింద గత బకాయిలతో కలిసి రూ.167 కోట్లు చెల్లించామని సీతక్క స్పష్టం చేశారు. కాంగ్రెస్ వచ్చే నాటికి పోస్టు మెట్రిక్ స్కాలర్ షిప్ బకాయిలు రూ. 4332 కోట్లు, పెండింగ్ స్కాలర్ షిప్ బకాయిలను త్వరలో చెల్లిస్తామని సీతక్క పేర్కొన్నారు. హస్టళ్లలో పిల్లలకు హాని చేస్తూ కఠిన చర్యలు తీసుకుంటాం. విదేశీ విద్య పథకం కింద ఎంపికైన విద్యార్థులకు త్వరలో ఫలాలు అందుతాయన్నారు. గత ప్రభుత్వం పెండింగ్ పెట్టిన బకాయిలు చెల్లిస్తూ వస్తున్నామని తెలిపారు.