హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో శుక్రవారం భూమి హక్కులు, సంస్కరణలపై చర్చ జరుగుతుంది. ఈ అంశంపై మంత్రి సీతక్క మాట్లాడుతూ.. గతంలో ధరణిలో జరిగిన అవుతవుకలతో రాష్ట్ర ప్రజలు చాలా సమస్యలు ఎదురుకున్నారని, ధరణిని ఎప్పుడు మరుస్తారని ప్రజలు అడుగుతున్నారని ఆమె పేర్కొన్నారు. పాత పేపర్ల పేరుతో ఉన్న పట్టా పుస్తకాలే ఇప్పుడు మా పేరు మీద ఉన్నాయని ప్రజలు తమ వద్దకు వస్తున్నట్లు మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం భూములు పట్టాలు చేయడంలో వీఆర్వోలు తప్పులు చేస్తున్నారని తీసేశారు.. మరి ఇప్పటికైన వాటిని సెట్ చేశారా..? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారన్నారు. ఇందిరమ్మ ఇచ్చిన భూములను కూడా లాక్కున్నారని, సీలింగ్ చట్టాన్ని తుంగలో తొక్కారని మంత్రి సీతక్క మండిపడ్డారు.