26-03-2025 12:00:00 AM
డీబీఎఫ్ జాతీయ కార్యదర్శి శంకర్
ఆదిలాబాద్, మార్చి 25 (విజయక్రాంతి): పట్టణంలోని కొమురం భీమ్ కాలనీని ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క సందర్శించి, ఆదివాసీలకు ఇండ్ల పట్టాలు, ఇందిర మ్మ ఇండ్లను నిర్మించాలని దళిత బహుజన ఫ్రంట్ (డిబిఎఫ్) జాతీయ కార్యదర్శి పి.శం కర్ డిమాండ్ చేశారు. ఇండ్ల స్థలాల కోసం కోమురం భీమ్ విగ్రహం ముందు ధర్నా చేస్తున్న ఆదివాసులకు మంగళవారం డీబీఎఫ్, వివిధ ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి.
తుడుం దెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గణేష్ గోడం అధ్యక్షతన జరిగిన సమావేశంలో డీబీఎఫ్ నేత శంకర్ మాట్లాడుతూ.. ఆదివాసులకు ఎందుకు ఇండ్ల పట్టా లను మంజూరు చేయడం లేదని ప్రశ్నించా రు. కార్యక్రమంలో డీబీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చుంచు రాజేందర్, రాష్ట్ర కార్యదర్శి పులి కల్పన, వివిధ సంఘాల నాయకులు, అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.