calender_icon.png 17 November, 2024 | 5:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతిపక్షాలకు రాజకీయాలే తప్ప.. సంక్షేమం పట్టదు

17-11-2024 02:44:31 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న దృష్ట్యా ప్రగతి సభ నిర్వహిస్తున్నట్లు మంత్రి సీతక్క పేర్కొన్నారు. సుమారుగా 50 వేల మంది హనుమకొండ సభలో పాల్గొనే అవకాశం ఉందన్నారు. హనుమకొండ వేదికగా 22 జిల్లాల్లో ఇందిరా మహిళా భవన్ లు ఏర్పాటు చేయబోతున్నామని, దీంతో మహిళలను కోటీశ్వర్లుగా చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నట్లు సీతక్క వెల్లడించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం  పదేళ్లు అధికారంలో ఉండి 21 లక్షల మందికే రుణమాఫీ చేసిందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 25 రోజుల్లోనే 23 లక్షల మందికి రుణమాఫీ చేసిందని మంత్రి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా బీఆర్ఎస్ నాయకులు అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్, బీజేపీకి పార్టీలకు రాజకీయాలే తప్ప.. ప్రజల సంక్షేమం పట్టదని సీతక్క దుయ్యబట్టారు.