calender_icon.png 18 March, 2025 | 4:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తాగునీటి సరఫరాలో ఎలాంటి సంక్షోభం లేదు

18-03-2025 11:57:10 AM

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు(Telangana Assembly Budget Sessions) కొనసాగుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో తాగునీటి సరఫరాలో ఎలాంటి సంక్షోభం లేదని మంత్రి సీతక్క(Minister Seethakka) తెలిపారు. నీటి సరఫరాకు ఆటంకం ఏర్పడితే ప్రత్యామ్నాయం ఏర్పాటు చేశామన్నారు. భూగర్భ జల వనరులను సిద్ధంగా ఉంచామన్నారు. నీటి సరఫరాను అనునిత్యం పరిశీలిస్తున్నామని సీతక్క వెల్లడించారు. నీటి సమస్యలపై ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నంబర్(Toll-free number for water problems) ఏర్పాటు చేశామని తెలిపారు. వేసవిలో నిరంతరం తాగునీటి కోసం రిజర్వాయర్ల వద్ద ఏర్పాట్లు చేశామని చెప్పారు. నీటి సరఫరా అవసరాలకు 2024 జనవరి నుంచి రూ. 298 కోట్లు మంజూరు అయిందన్నారు. 34 భారీ తాగునీటి సరఫరా పథకాల కోసం రూ. 745 కోట్లు కేటాయించామని చెప్పారు. గ్రామాల్లో నీటీి అవసరాల కోసం రూ. 175 కోట్లతో ప్రతిపాదనలు వచ్చాయని మంత్రి సీతక్క(Seethakka) పేర్కొన్నారు.