calender_icon.png 24 January, 2025 | 6:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ అంటేనే ప్రజా సంక్షేమం: మంత్రి సీతక్క

24-01-2025 01:54:40 PM

హైదరాబాద్: ములుగు జిల్లా మల్లంపల్లిలో నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి సీతక్క(Minister Seethakka) పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజా సంక్షేమమని మంత్రి సీతక్క అన్నారు. ఇళ్లు లేని వాళ్లకే మొదటి ప్రాధన్యత ఇస్తున్నామని ఆమె పేర్కొన్నారు. బీఆర్ఎస్ నాయకులు(BRS Leaders) చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. రాబోయే బడ్జెట్ లో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు. అభయహస్తం డబ్బులు కూడా మీ ఖాతాలోకి వస్తాయని మంత్రి స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ(Congress party) ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందని సీతక్క తేల్చిచెప్పారు.