calender_icon.png 18 April, 2025 | 3:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళా శిశుసంక్షేమ శాఖ అధికారులతో మంత్రి సీతక్క సమీక్ష

10-04-2025 07:39:03 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): మహిళా శిశుసంక్షేమ శాఖ అధికారులతో శిశుసంక్షేమ శాఖ మంత్రి సీతక్క గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. పొషకాహార తెలంగాణే మన లక్ష్యంగా సిబ్బంది పని చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అంగన్‌వాడీ కేంద్రాలు పూర్తిస్థాయిలో పనిచేసేలా చర్యలు తీసుకోవాలని, అంగన్వాడీలో చిన్నారుల సంఖ్య పెంచాలని, పొషకాహార నాణ్యతలో రాజీ లేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇంకా 313 సెంటర్లు మూతపడి ఉండడం బాధాకరమని, చిన్నారులు లేని అంగన్‌వాడీ కేంద్రాలను డిమాండ్ ఉన్న చోట్లకు తరలించాలని సూచించారు. వచ్చే విద్య సంవత్సరంలో అన్ని కేంద్రాలు చిన్నారులతో కల కల లాడాలని, ఇకపై గ్రేడింగ్, అవార్డులు, ఈ-టెండర్ విధానం తప్పనిసరి అని చెప్పారు. బాలల భవిష్యత్‌తో ఆడకుండా, బాధ్యతగా పనిచేయాలని అధికారులను ఆదేశించారు.