హైదరాబాద్: తెలంగాణ సచివాలయంలో మహిళా శిశు సంక్షేమశాఖ పై మంత్రి సీతక్క బుధవారం సమీక్ష నిర్వహించారు. అంగన్వాడీ సెంటర్ల పనితీరు, అందుతున్న సేవలపై జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశానికి మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి వాకటి కరుణ, కమిషనర్ కాంతి వెస్లీ, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై మంత్రి చర్చించినట్లు తెలుస్తోంది.